అఖిల్ కు జోడీగా కల్యాణి.. ఎవరీ కళ్యాణీ..?

అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసింది. హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. దాదాపు 12 కోట్లకు పైగా ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కు ఖర్చు పెట్టారని సమాచారం. అయితే ఇంతవరకు సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మేఘాఆకాష్ ను తీసుకుంటారని వార్తలు వచ్చాయి కానీ నాగార్జున మాత్రం ఓ కొత్త అమ్మాయిని వెండితెరకు పరిచయం చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో వినిపిస్తోన్న పేరే కళ్యాణి. ఇంతకీ ఈ కళ్యాణి ఎవరనుకుంటున్నారా..? 
పలు మలయాళం, హిందీ చిత్రాలను డైరెక్ట్ చేసిన సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు. ఇటీవలే న్యూయార్క్ లో చదువు పూర్తి చేసుకొని ఇండియాకు వచ్చిన కల్యాణి ప్రియదర్శన్ తండ్రి ప్రోత్సాహంతో దర్శకత్వశాఖలో పని చేస్తోంది. ఇటీవల విక్రమ్ నటించిన ‘ఇంకొక్కడు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది. అయితే ఇప్పుడు తన తల్లి మాదిరి హీరోయిన్ గా కెరీర్ టర్న్ తీసుకోవాలనుకుంటోంది. ఇప్పటికే ఆమెకు పలు సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ, కల్యాణి మాత్రం అంగీకరించలేదు. అఖిల్, విక్రమ్ కుమార్ ల కాంబినేషన్ పై ఆసక్తి కలగడం, హీరోయిన్ గా నటించమని ఆమెను సంప్రదించడంతో తనకు ఇది మంచి డెబ్యూ ఫిల్మ్ అవుతుందని భావిస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన 
అధికార ప్రకటన చేయనున్నారు. మరి డైరెక్టర్ గారమ్మాయి హీరోయిన్ గా ఎంతవరకు మెప్పిస్తుందో.. 
చూడాలి!