రాజు గారి కోసం చిరంజీవి..?

ప్రస్తుతం ఉన్న నిర్మాతల్లో అగ్ర నిర్మాతగా హవా కొనసాగిస్తున్నారు దిల్ రాజు. ఆయన ఏ ప్రాజెక్ట్ మొదలు పెట్టినా.. ముందు నుండే ఆ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతుంటాయి. కథల విషయంలో చాలా పక్కగా ఉండే ఈ నిర్మాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా చేయాలని భావిస్తున్నాడు. కానీ చిరు ఉన్న పరిస్థితుల్లో దిల్ రాజుకి డేట్స్ ఇస్తాడా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.

ప్రస్తుతం చిరు, రామ్ చరణ్ నిర్మాతగా మరో సినిమా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడు. దీని తరువాత అల్లు అరవింద్ నిర్మాతగా.. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాల తరువాత కూడా చిరు సినిమాల్లో నటించే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఆ తరువాత చిరు చేయబోయే సినిమా దిల్ రాజు బ్యానర్ లో ఉంటుందని టాక్.

నిన్న జరిగిన శతమానం భవతి సక్సెస్ మీట్ లో చిరు మెరవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో.. చూడాలి!