HomeTelugu Trendingషకీలా ఎంతమందిని ప్రేమించిందో తెలుసా!

షకీలా ఎంతమందిని ప్రేమించిందో తెలుసా!

3 301990 దశకంలో షకీలా సినిమాలు వస్తున్నాయి అంటే పెద్ద పెద్ద హీరోలు సైతం భయపడిపోయేవారు. సినిమా చూసేందుకు థియేటర్ల దగ్గర క్యూ కట్టేవారు. నెల్లూరు జిల్లాకు చెందిన షకీలా మొదట తెలుగు సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని వచ్చింది. అనుకోకుండా కొందరి చేతిలో మోసపోవడం వలన బతుకుతెరువు కోసం పెద్దల సినిమాల్లో నటించాల్సి వచ్చింది.

షకీలా సినిమా అంటే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అయితే, ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి ఇష్టం లేక చేసుకోలేదా మరేదైనా కారణం ఉన్నదా అంటే చాలా కారణాలు చెప్పింది. లైఫ్ లో తాను ఏడు మందిని లవ్ చేసినట్టు చెప్పింది. ప్రేమించే సమయంలో మనస్ఫూర్తిగా ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రేమించినట్టు చెప్పింది. ప్రేమించిన వ్యక్తులంతా.. తనను రకరకాలుగా మోసం చేసినట్టు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

అన్నదమ్ములు ప్రేమ విషయంలో జోక్యం చేసుకోవడానికి గాని, పెళ్లి తరువాత తన కుటుంబంతో సంబంధాలు గాని ఉండకూడదని కొందరు కండిషన్స్ పెడితే.. కొందరేమో తన తల్లిని అనాధ ఆశ్రమంలో వదిలేయాలని కోరారని అందుకు తాను ఎంతమాత్రం ఒప్పుకోలేదని చెప్పింది. తనకు పెళ్లి కంటే తన కుటుంబమే ముఖ్యమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నది. షకీలా జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu