HomeTelugu Newsసూర్యగ్రహణంతో కరోనా అంతమవుతుందా?

సూర్యగ్రహణంతో కరోనా అంతమవుతుందా?

3 19
రేపటి (జూన్ 20) సూర్యగ్రహణంతో ఖగోళంలో అద్బుత సంఘటన జరగబోతోందని ప్లానిటరీ సొసైటీ సైంటిస్ట్ రఘునందన్ తెలిపారు. పూర్తిస్థాయి వలయాకార సూర్య గ్రహణం జరుగుతుందన్నారు. విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 నుండి మధ్యాహ్నం 3.04 వరకు సూర్య గ్రహణం ఉంటుందని వెల్లడించారు. ‘‘భారత్‌లో మాత్రం గ్రహణం పూర్తి స్థాయిలో ఉండదని తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఈ గ్రహణం ముందుగా కనిపిస్తుందని.. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనపడుతుందన్నారు. సాధారణంగా సూర్యుని కిరణాలు నేరుగా భూమిపై పడతాయి. కానీ సూర్యగ్రహణం కారణంగా రేపు అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడతాయి.

అయితే రేపటి సూర్యగ్రహణంతో కరోనా అంతమవుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అవన్నీ వదంతులేనని తెలిపారు. గ్రహణం ప్రభావంతో కరోనా వైరస్ 0.001 శాతం మాత్రమే చనిపోయే అవకాశం ఉందన్నారు. 100 శాతం అంతమయ్యే అవకాశం లేదన్నారు. తెలంగాణలో సూర్యగ్రహణం రేపు ఉదయం 10.15 గంటల నుండి మధ్యాహ్నం 1.44 గంటల వరకు 51 శాతం సూర్యగ్రహణం ఉంటుంది. ఆంద్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుండి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం ఉంటుందని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu