ఆ డ్రగ్ అడిక్ట్స్ ఎవరో..?

సినిమా రంగంలో పది మంది వరకు సెలబ్రిటీలు మత్తు మందుల బారిన పడ్డారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మత్తుమందు బారిన పడ్డ ఆ పది మంది వాటిని వదిలేయాలని పిలుపునిచ్చారు అల్లు అర్జున్. ఇటీవల హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాతకు ఈ విషయంలో ప్రమేయం ఉందని వార్తలు వచ్చాయి. అయితే అది ఎవరనే విషయాన్ని మాత్రం బయటకు రానివ్వలేదు. ఈ క్రమంలో నిర్మాత అల్లు అరవింద్,
సురేష్ బాబు హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి ఇలా అనౌన్స్ చేయడంతో తెర వెనుక ఏదో జరిగుంటుందనే అనుమానాలు రేకెత్తిస్తోంది.

టాలీవుడ్ పరువు పోకుండా, ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా.. ముందుగా ఈ ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. అల్లు అర్జున్ మాటల బట్టి ఆయన దగ్గర పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉందని తెలుస్తోంది. మరీ ఆ డ్రగ్ అడిక్ట్స్ ఎవరో.. ఇప్పటికైనా జాగ్రత్త పడితే ఎలాంటి సమస్యలు ఉండవు. అలా కాకూడా ముందుకు వెళితే మాత్రం కష్టాలను కొని
తెచ్చుకున్నట్లవుతుంది.