డి.జె ఆ సినిమాకు కాపీనా..?

అల్లు అర్జున్, హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తొలిసారిగా అల్లు అర్జున్ ఈ సినిమాలో బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. దీంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓ బ్లాక్ బాస్టర్ సినిమాకు రీమేక్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన ‘జెంటిల్ మెన్’ సినిమాకు డిజె కాపీ అంటూ టాలీవుడ్
టాక్. జెంటిల్ మెన్ సినిమాలో కూడా హీరో బ్రాహ్మణ కుర్రాడే.

అతడు కూడా కేటరింగ్ బిజినెస్ చేస్తుంటాడు. అయితే అతనిలో మరో కోణం ఉంటుంది. తప్పుచేసేవాళ్లని శిక్షిస్తూ జెంటిల్ మెన్ అనిపించుకుంటాడు. ఇప్పుడు డిజె పరిస్థితి కూడా అంతే అని సమాచారం. అల్లు అర్జున్ కూడా సినిమా మొదటి భాగంలో వంట వాడిగా, సెకండ్ హాఫ్ లో చీడపురుగులను ఏరేసే మరొక భిన్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఈ కథకు రొమాన్స్, యాక్షన్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మాస్ ప్యాకేజ్ ని అందించనున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ సినిమా వచ్చే నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.