‘ఫలక్‌నుమా దాస్’ సినిమా ట్రైలర్

మారుతున్న ప్రేక్షకుల అభిరుచుకి తగ్గట్టు దర్శకులు తమ సినిమాల్లో వాస్తవికత ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. అందుకు ఉదాహరణే కొద్దిసేపటి క్రితమే విడుదలైన ‘ఫలక్‌నుమా దాస్’ సినిమా ట్రైలర్. నటుడు విశ్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇది. ట్రైలర్ చూస్తే సినిమాలో వాస్తవిక పరిస్థితులు, వాస్తవిక పాత్రలతో పాటు బూతులు కూడా ఉంటాయనిపిస్తోంది. ఫలక్‌నుమా లాంటి మాస్ ఏరియాలో విరివిగా వాడుకలో ఉండే బూతులనే ఈ నిమాలో బాగా వాడారు. ఇక కంటెంట్ విషయానికొస్తే యువతను ఆకట్టుకునే గ్రిప్పింగ్ స్టఫ్ చిత్రంలో ఉందనే అనిపిస్తోంది.