ప్రణబ్‌ ముఖర్జీ మృతిపై చిరంజీవి, మహేష్‌ల దిగ్బ్రాంతి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ(84) మృతి పట్ల ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రణబ్‌ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ప్రణబ్ ముఖర్జీ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. అతనితో నేను గడిపిన క్షణాలను ఎప్పటికి గుర్తుంటాయి. ఒక గొప్ప జ్ఞానం, విశిష్టమైన రాజకీయ జీవితాన్ని సాధించిన వ్యక్తి మీరు. మిమ్మల్ని మిస్ అవుతాము సర్.. దేశం ఈ రోజు ఒక విలువైన వజ్రాన్ని కోల్పోయింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రణబ్‌ దా..’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు స్పందిస్తూ.. ప్రణబ్ ముఖర్జీ మరణించడం బాధగా ఉందని అన్నారు. తన అత్యంత మేధోశక్తికి, ఉత్తమ నాయకునికి ఈ దేశం సంతాపం ప్రకటిస్తుందన్నారు. ప్రణబ్‌ కుటుంబ సభ్యులకు చేతులు జోడించి హృదయపూర్వక సంతాపం తెలిపారు. వీరితోపాటు అజయ్‌ దేవ్‌గణ్‌, తాప్సీ, రితేష్‌ దేశ్‌ముఖ్‌, లతా మంగేష్కర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, వరుణ్‌ దావన్‌, శిల్పా శెట్టి, శ్రీను వైట్ల వంటి పలువురు ప్రముఖులు ప్రణబ్‌ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు

CLICK HERE!! For the aha Latest Updates