బాహుబలి కోసం షూటింగ్ కు సెలవు!

ప్రస్తుతం ప్రేక్షకుల్లో బాహుబలి మేనియా ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. థియేటర్ల దగ్గర టికెట్ల కోసం పడిగాపులు గాస్తున్నారు అభిమానులు. మరోపక్క ఎక్కువ రేట్లకు, బ్లాక్ లో టికెట్లను విక్రయిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో బాహుబలి రిలీజ్ రోజు సెలవు అనే అంశం చర్చనీయాంశం అవుతుంది. మంచు మనోజ్ నటిస్తోన్న ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా షూటింగ్ కు బాహుబలి రిలీజ్ రోజు సెలవు ప్రకటించారట ఆ చిత్రదర్శకుడు. మనోజ్ విషయంలో మాత్రమే కాదు.. షూటింగ్ దశలో ఉన్న చాలా చిత్రాలకు ఆరోజు సెలవు దొరకబోతోంది.
 
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని తెలుసుకోవాలనే ఆసక్తితో అందరూ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా అయినా.. చూడాలని ఫిక్స్ అయిపోయారు. సినిమా కూడా దాదాపు ఆరు వేల థియేటర్లకు పైగా విడుదలవుతోంది!