HomeTelugu Big Stories'ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో' ట్రైలర్‌ విడుదల

‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’ ట్రైలర్‌ విడుదల

First Day First Show movie

జాతిర‌త్నాలు ఫేమ్‌ అనుదీప్ కేవీ స్టోరీనందిస్తున్న చిత్రం ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’. శ్రీకాంత్ రెడ్డి హీరోగా ఎంట్రీ ఈ సినిమాలో.. సంచితా బ‌సు హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీజా ఎంటర్ టైన్ మెంట్స్ మిత్ర విందా మూవీస్ బ్యానర్ లపై శ్రీరామ్ ఏడిద సమర్పణలో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ ఏడిద ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో వంశీధర్ గౌడ్ లక్ష్మీ నారాయణ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ని హీరో నేచురల్ స్టార్ నాని బుధవారం విడుదల చేశారు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూడ‌క‌పోతే చ‌చ్చిపోతార్రా.. అంటూ త‌నికెళ్ల‌భ‌ర‌ణి త‌న కొడుకును వారిస్తున్న డైలాగ్‌తో మొద‌లైంది ట్రైల‌ర్‌. రియల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో సాగే హిలేరియస్ ఎంటర్ టైనర్ ఈ మూవీ వుంటుందని ట్రైలర్ తో స్పష్టమవుతోంది. త్వరలోనే ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!