HomeTelugu Newsతెలుగు రాష్ట్రాల్లో అల్లాడిపోతున్న మందుబాబులు

తెలుగు రాష్ట్రాల్లో అల్లాడిపోతున్న మందుబాబులు

14 11

తెలుగు రాష్ట్రాల్లో మందు బాబులు అల్లాడి పోతున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అందులో భాగంగా కల్లు దుకాణాలు, వైన్స్, బార్‌లు మూసివేయడంతో మందు బాబులకు కష్టాలు మొదలు అయ్యాయి. కల్లుకు అలవాటు పడిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్ని దుకాణాలు మూతపడటంతో ప్రతిరోజూ ఓ పెగ్గు వేస్తేనే గాని నిద్రపట్టని మందుబాబులు నరకం చూస్తున్నారట. మద్యానికి బానిసలైన కొందరు అదిదొరక్కపోయే సరికి పిచ్చివాళ్లుగా, వింతగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు ఆత్మహత్యలకు సైతం వెనుకాడటం లేదంటే పరిస్థితి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు.

కల్లులో క్లోరోఫామ్, డైజోఫాం లాంటి రసాయనాలు కలపడం వల్ల అది తాగిన వారికి అలవాటుగా మారుతుంది. లాక్‌డౌన్ వల్ల 6 రోజులుగా కల్లు దొరక్కపోయే సరికి వాళ్ల శరీరంలో మార్పులు వస్తున్నాయట. కొంతమంది ఫిట్స్ తో చనిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి బాధితులు ఇప్పటికే ఆస్పత్రులకు భారీగా క్యూకడుతున్నారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి ఒక్క రోజే వందమంది వచ్చారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

మందు బాబుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేరళ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. దీని కోసం ప్రత్యేకంగా ఆల్కహాల్ పాస్‌లు జారీచేయాలని నిర్ణయం తీసుకున్నారట. మందుబాబులకు ఊరట కలిగించేలా కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆల్కాహాల్ లేకపోతే విచిత్రంగా ప్రవర్తించే వారిని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అన్ని మద్యం షాపులు తెరవరు. డాక్టర్ నుంచి ప్రిస్ర్కిప్షన్ తీసుకొస్తేనే, అంటే డాక్టర్ రికమండ్ చేస్తేనే మద్యాన్ని తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటికే కేరళ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. మరి తెలుగు రాష్ట్రలో కూడా అమలవుతాయేమోనని మందుబాబులు ఎదురు చూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu