Bigg Boss 8 Telugu Soniya Akula:
Bigg Boss 8 Telugu ప్రతి వారం ఒక కొత్త మలుపు తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాలుగో వారంలో ఒక ఊహించని మలుపు తీసుకుని, సోనియా ఆకుల హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మేకర్స్ ఆమెకు మద్దతిస్తున్నారని వచ్చిన వదంతుల మధ్య, ఆమె హఠాత్తుగా బయటకు రావడంతో అభిమానులతో సహా కంటెస్టెంట్లను కూడా ఆశ్చర్యపరిచింది.
సోనియా తన నోటి దురుసు కారణంగా బాగానే పాపులర్ అయ్యింది. అయితే, ఆమె బోల్డ్ వ్యక్తిత్వం అందరికీ నచ్చలేదు. నిఖిల్, పృథ్విరాజ్ లతో ఆమెకున్న గొడవలు హౌస్‌లో విభేదాలు తెచ్చాయి. ఈ గొడవలే ఆమెపై నేగెటివిటీ పెరగడానికి కారణమయ్యాయని.. దీనివల్ల చివరికి ఎలిమినేట్ అయ్యిందని చెప్పుకోవచ్చు.
సోనియా నిఖిల్, పృథ్విరాజ్‌ల గేమ్‌ప్లేను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుందని చాలా మంది హౌస్‌మేట్స్, ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా ఆమె నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు తక్కువ ఓట్లు వచ్చాయి. హౌస్‌మేట్స్ కూడా ఆమెకు వ్యతిరేకంగా ఎక్కువగా ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో హోస్ట్ నాగార్జున ఆమె ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు.
సోనియా రెమ్యునరేషన్
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినా, సోనియా ఖాళీ చేతులతో వెళ్లలేదు. తాజా సమాచారం ప్రకారం, ఆమెకు హౌస్‌లో ఉన్న ప్రతి వారం సుమారు 1.50 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారు. మొత్తం నాలుగు వారాలకు ఆమెకు సుమారు 6 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రయాణం మధ్యలో ముగిసినా, ఫైనాన్స్ పరంగా మంచి మొత్తాన్ని అందుకుంది అని చెప్పుకోవచ్చు.
తాజా సమాచారం ప్రకారం, బిగ్ బాస్ తెలుగు 8 ఐదవ వారంలో ఊహించని మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ గురువారం ఒక కంటెస్టెంట్ నామినేషన్స్‌లో ఉండి హౌస్‌కి వీడ్కోలు చెప్పనున్నారు. సాధారణంగా వీకెండ్‌లోనే ఎలిమినేషన్ జరిగే విషయం తెలిసిందే. అయితే ఈ సారి మిడ్ వీక్ ఎలిమినేషన్ సెన్సేషన్ గా మారింది.
Read More: Bigg Boss 8 Telugu లో మళ్ళీ ఎలిమినేషన్? ఈసారి పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేశారుగా!