Game Changer censor board:
రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా ఎస్. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న పొలిటికల్ డ్రామా ‘గేమ్ చేంజర్’ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చినా, కొన్ని అభ్యంతరాలు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో టైటిల్ కార్డులు, బ్రహ్మానందం పేరు మీద సెన్సార్ బోర్డు కొన్ని సూచనలు ఇచ్చింది.
సెన్సార్ బోర్డు సూచించిన మార్పులు:
1. తెలుగు టైటిల్:
సెన్సార్ బోర్డు, “గేమ్ చేంజర్” టైటిల్ తెలుగు భాషలో కూడా ఉండాలని సూచించింది. ఇది సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ కేవలం ఆంగ్లంలోనే ఉండగా, ఇప్పుడు ‘గేమ్ చేంజర్’పై ఇలాంటి డిమాండ్ ఎందుకని ప్రశ్నలు వస్తున్నాయి.
2. బ్రహ్మానందం పేరుపై వివాదం:
టైటిల్ కార్డులో బ్రహ్మానందం పేరుకి ‘పద్మశ్రీ’ అనే గౌరవాన్ని ఉపయోగించడంతో సెన్సార్ బోర్డు ఆ పదాన్ని తొలగించాలని చెప్పింది. గతంలో ‘దేనికైనా రెడీ’ చిత్రానికి సంబంధించిన వివాదంలో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మోహన్ బాబు, బ్రహ్మానందం తమ అవార్డులను పేరు ముందు ఉపయోగించరాదు అని.. అలా చేస్తే అవార్డులు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. కానీ ఇప్పటికీ బ్రహ్మానందం ఆ అవార్డు ఇచ్చారా అనే దానిపై స్పష్టత లేదు.
రేపు అనగా జనవరి 4న రాజమండ్రిలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. పవన్ కల్యాణ్ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇది సినిమాపై భారీ హైప్ తీసుకొస్తోంది. డైరెక్టర్ శంకర్ ఇటీవల మాట్లాడుతూ, “రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డ్ వస్తుంది” అని చెప్పడం సినిమాపై అంచనాలను మరింతగాపెంచింది. ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈ సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌తో చాలా సంతృప్తిగా ఉన్నారని టాక్ నడుస్తోంది.
ALSO READ: Game Changer ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. సినిమా ఎలా ఉందంటే!