‘ఘాజి’ కి క్లీన్ ‘యు’!

రానా, తాప్సీ, కే.కే.మీనన్, అతుల్ కుల్కర్ణి ముఖ్యపాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం “ఘాజి”. 1970 నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పివిపి సినిమా మరియు మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని “క్లీన్ యు” సర్టిఫికెట్ అందుకొంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపధ్యంలో రూపొందిన మా “ఘాజి” చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ “యు” సర్టిఫికేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్రిల్లింగ్ వార్ ఎపిసోడ్స్ తోపాటు మధి సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ ప్రేక్షకుల్ని సీట్ లో కట్టిపడేస్తాయి. హై ప్రొడక్షన్ వేల్యూస్, రానా, తాప్సీల ఆధుతమైన నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఫిబ్రవరి 17న “ఘాజి” చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందన్న నమ్మకం ఉంది” అన్నారు.