HomeTelugu Trendingఅడివి శేష్‌ 'హిట్ 2 ది సెకండ్ కేస్' ఫస్ట్‌ గ్లింప్స్‌

అడివి శేష్‌ ‘హిట్ 2 ది సెకండ్ కేస్’ ఫస్ట్‌ గ్లింప్స్‌

Glimpse of Kd from HIT2

నాని నిర్మాతగా విశ్వక్‌ సేన్‌ హీరోగా 2020లో వచ్చిన ‘హిట్ .. ది ఫస్టు కేస్’ సినిమా సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు నాని ‘హిట్ 2 ది సెకండ్ కేస్’ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. నేడు(డిసెంబర్‌ 17) అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్టు గ్లింప్స్‌ విడుదల చేశారు.

ఇందులో అడివి శేష్‌ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. ఆయనకి సంబంధించిన యాక్షన్ .. ఎమోషన్ సన్నివేశాలతో వదిలిన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఒక కేసుకు సంబంధించిన ఆధారాల కోసం సాగే అన్వేషణ .. ఆ నేపథ్యంలో అతనికి సహకరించే పోలీస్ డాగ్ .. కేసు విషయంలో చిక్కుముడులను ఎలా విప్పుకురావాలనే ఆలోచనలో పడటం .. తన అన్వేషణకి అడ్డుపడినవారికి పోలీస్ కోటింగ్ ఇవ్వడం ఇవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!