విజయ్ దేవరకొండ నిర్మాణంలో బస్తీ కుర్రాడిగా తరుణ్!

యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ యువ దర్శకుడు త్వరలో హీరోగా మారనున్న సంగతి తెలిసిందే. అర్జున్‌ రెడ్డి సినిమాలో సంచలనం సృష్టించిన విజయ్‌, రౌడీస్‌ అని ప్రేమగా పిలుస్తూ అభిమానులకు మరింత చేరువయ్యాడు. ఇటీవల విడుదలైన నోటా సినిమాతో నిర్మాతగా మారిన విజయ్‌, నిర్మాతగా తన తదుపరి చిత్రాన్ని కూడా ఫైనల్‌ చేసే ఆలోచనలో ఉన్నాడట. విజయ్ దేవరకొండ నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ ది హిల్ నిర్మించనున్న సినిమాలో తరుణ్ హీరోగా కనిపించనున్నాడు.

తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. తీవ్రవాద నేపథ్యమున్న కథతో రూపొందుతున్న ఈ సినిమాలో బస్తీ కుర్రాడిలా భాస్కర్ ఒక పాత బస్తీ కుర్రాడిలా కనిపిస్తాడట. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఇతర నటీనటులు ఎవరు వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.