తండ్రైన గోపీచంద్‌

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు గోపీచంద్‌ రెండోవ సారి తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి రేష్మా వినాయక చవితి రోజున ఉదయం ఓ పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని గోపీచంద్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘మాకు మళ్లీ బాబు పుట్టాడు. వినాయక చవితి పర్వదినాన ఇంతకంటే బెస్ట్‌ సర్‌ప్రైజ్‌ మరొకటి ఉండదు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్‌కు బంధువైన రేష్మకు..గోపీచంద్‌కు 2013 మేలో వివాహమైంది. వీరిద్దరి ఒక కుమారుడు ఉన్నాడు. పేరు విరాట్‌ కృష్ణ. తన రెండో కుమారుడి పేరును మాత్రం గోపీచంద్‌ ప్రకటించలేదు.

ఇటీవలే గోపీచంద్ నటించిన ‘పంతం’ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఈ చిత్రానికి చక్రవర్తి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మెహరీన్‌ కథానాయికగా నటించారు. గోపీచంద్‌ తన తర్వాత సినిమా గురించి ఎలాంటి సమాచారం లేదు.