దేశం మీసం తిప్పుదాం!

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా ట్రైలర్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతంలో కోటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేయించిన తరువాత తిరుమల థియేటర్లో ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ భారీతనానికి అద్దం పడుతోంది. ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్ గా ఉంది. విజువల్స్, గ్రాఫిక్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయం.

యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ తో ట్రైలర్ ను అధ్బుతంగా కట్ చేశారు. బాలయ్య వేషధారణ ఆయన డైలాగ్ డెలివరి మరో హైలైట్ గా నిలిచింది. ‘దేశం మీసం తిప్పుదాం’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ అదిరింది.

బాలకృష్ణ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.