HomeTelugu Big StoriesChiranjeevi: చిరంజీవిని గుర్తించిన ప్రభుత్వానికి సోనూసూద్‌ కనపడలేదా?

Chiranjeevi: చిరంజీవిని గుర్తించిన ప్రభుత్వానికి సోనూసూద్‌ కనపడలేదా?

Chiranjeevi is about to rec

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ‘విశ్వంభర’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

తాజాగా చిరంజీవి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే పద్మభూషణ్‌ అందుకున్న చిరంజీవి తాజాగా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డుకు ఎంపికైన‌ట్లు టాక్‌. రిప‌బ్లిక్ డే సంద్భరంగా మోడీ ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ప‌ద్మ అవార్డ్స్ లిస్ట్‌లో చిరంజీవి పేరు ప్ర‌ముఖంగా ఉందంట.

కొవిడ్ స‌మ‌యంలో సినీ కార్మికులతో పాటు సామాన్యుల‌ను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవ‌ల‌ను గుర్తించి మోడీ ప్ర‌భుత్వం మెగాస్టార్‌ను ప‌ద్మ‌విభూష‌ణ్‌తో స‌త్క‌రించ‌నున్నారట. లాక్‌డౌన్ టైమ్‌లో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు అంద‌జేశారు చిరంజీవి.

సినీ కార్మికుల‌తో పాటు కొవిడ్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డిన సామ‌న్య ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు అంబులెన్స్‌, ఆక్సిజ‌న్ స‌దుపాయాల‌ను ఉచితంగా క‌ల్పించారు. ఆయన సేవ‌ల‌ను గుర్తించి ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డును ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

చిరంజీవి ప‌ద్మ‌విభూష‌ణ్‌కు ఎంపికైన వార్త టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్‌లో సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. అయితే కరోనా టైమ్‌లో చిరంజీవి కంటే సోనూసూద్‌ చేసిన సేవలు వేలకట్టలేనివి. ఆ టైమ్‌లో ఆయన చేసిన సేవలకు గాను రియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మరికొందరికి దేవుడుగా మారాడు. మరి చిరంజీవికే పద్మవిభూషణ్‌ ఇస్తే.. సోనూసూద్‌కు ఏ అవార్డు ఇవ్వాలి అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu