
NC24 Shooting Update:
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న NC24 కి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ “The Excavation Begins” రిలీజ్ అవుతూ, అక్కినేని ఫ్యాన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసింది. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ డండు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌లో చైతన్య ఓ నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించనున్నాడు అంటున్నారు.
ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఒక భారీ కేవ్ (గుహ) సెటప్‌ని కట్టించారు. ఈ సెట్‌కి దాదాపు రూ.10 కోట్లు ఖర్చు పెట్టారట. శ్రీ నాగేంద్ర తంగాల ఈ సెట్స్‌ని డిజైన్ చేశారు. నిజంగా ఒక రియల్ గుహలోకి వెళ్లినట్టు ఫీల్ వచ్చేలా ఈ సెట్ తయారైందట.
నాగచైతన్య ఈ సినిమాలో ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించబోతున్నాడు కాబట్టి, కథలో చాలా భాగం ఈ గుహలోనే జరుగుతుంది. ముఖ్యమైన సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఈ కేవ్ సెట్లోనే షూట్ అవుతాయి. ఇప్పటివరకు 18 రోజుల షూటింగ్ పూర్తయ్యిందట. మిగిలిన షెడ్యూల్ ఎక్కువగా ఈ సెట్లోనే జరగనుంది.
చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఆమె లక్ష్య అనే ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించనుంది. ఇద్దరి కాంబినేషన్‌తో మిస్టరీ, మైథలజీ, అడ్వెంచర్ అన్నీ మిక్స్ అయిన ఇంట్రెస్టింగ్ జర్నీగా ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ వారు ప్రెజెంట్ చేస్తున్నారు. స్క్రీన్‌ప్లేను స్వయంగా సుకుమార్ పర్యవేక్షిస్తున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ బి లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు.
అన్ని రకాలుగా చూస్తే, NC24 ఈసారి చైతన్యకు ఓ మైలురాయి సినిమా అవుతుందని అంచనా!
ALSO READ: NC24 సినిమాలో Naga Chaitanya, Meenakshi Chaudhary ల పాత్రలు ఇవే..