
Mary Kom Divorce:
మేరీ కోమ్ – భారతదేశపు గర్వంగా నిలిచిన బాక్సింగ్ లెజెండ్. కానీ ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం కాస్త క్లిష్టంగా మారింది. 20 ఏళ్ల వివాహ జీవితం తర్వాత మేరీ కోమ్, ఆమె భర్త కరుంగ్ ఓన్లర్ (ఒన్లర్) వేరువేరుగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
వీరి మధ్య దూరం ఎందుకు పెరిగిందంటే, 2022 మణిపూర్ ఎన్నికల్లో ఓన్లర్ పోటీ చేయడం, దాదాపు 2–3 కోట్లు ఖర్చు చేయడం వల్ల ఫైనాన్షియల్ ప్రెజర్ వచ్చిందట. ఈ సమస్యలతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయట.
ప్రస్తుతం మేరీ కోమ్ ఫరీదాబాద్‌లో తన నాలుగు పిల్లలతో ఉంటోంది. ఓన్లర్ మాత్రం ఢిల్లీలో తన ఫ్యామిలీతో విడిగా ఉంటున్నాడు. అధికారికంగా డివోర్స్ పిటిషన్ వేయకపోయినా, వీరి వేరువేరు జీవనం చూసి విడాకుల గాసిప్స్ ఊపందుకున్నాయి.
ఇంతలో మేరీ కోమ్ కొత్త సంబంధంలో ఉందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆమె ఒక వ్యక్తితో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టింది. అతన్ని తన బిజినెస్ పార్టనర్‌గా చెప్పినా, కొంతమంది దీన్ని ప్రేమ సంబంధంగా అనుకుంటున్నారు. కానీ మేరీ దీనిపై స్పందించలేదు.
మెరీ కోమ్ – 2005లో ఓన్లర్‌ను పెళ్లి చేసుకుంది. ముగ్గురు కొడుకులు, 2018లో దత్తత తీసుకున్న కుమార్తె ఉన్నారు. ఓన్లర్ తన ఫుట్‌బాల్ కెరీర్‌ను వదిలేసి, ఆమె డ్రీమ్‌ను సపోర్ట్ చేశాడు.
మెరీ కోమ్ సంపద విషయానికొస్తే, ఆమె నెట్ వర్త్ సుమారు రూ.33 నుంచి 42 కోట్లు ఉంటుంది. బాక్సింగ్, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, స్పీచ్ ఈవెంట్స్, అలాగే ఆమె జీవితం ఆధారంగా తీసిన సినిమా ద్వారా మంచి ఆదాయం వస్తోంది. ఆమె వద్ద మెర్సిడెస్ బెంజ్ GLS, రెనాల్ట్ కిగర్ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.
మెరీ కోమ్ తన చిన్న గ్రామం నుండి ప్రపంచ విజేతగా మారిన ప్రయాణం ఎంతో ప్రేరణాత్మకం. ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోంది అనేది చూసుకోవాల్సిందే!
ALSO READ: మూడేళ్లలో 3000 కోట్లకి పైగా.. Rashmika Mandanna మాములు రికార్డు కాదు