HomeTelugu Big StoriesAnimal: మరింత కంటెంట్‌తో ఓటీటీలోకి 'యానిమల్‌'

Animal: మరింత కంటెంట్‌తో ఓటీటీలోకి ‘యానిమల్‌’

Animal on OTT with more c

Animal: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్, రష్మితోపాటు అనిల్ కపూర్ తృప్తి దిమ్రి, బాబీ డియోల్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

థియేటర్స్‌లో తీవ్ర వివాదం సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌ డేట్‌ కన్ఫమ్ అయింది. ఈ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు ఓటీటీలో కొన్ని అదనపు సీన్లను కూడా చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కనున్నట్లు తెలుస్తున్నాయి.

ఓటీటీలో ఈమూవీ 8 నిమిషాలు ఎక్కువ నిడివితో రానుండటం విశేషం. నిజానికి థియేటర్లలోనే ఈ సినిమా 3 గంటల 21 నిమిషాలతో చాలా పెద్దదిగా ఉంది. ఇప్పుడు ఓటీటీలో ఈ నిడివి కాస్తా 3 గంటల 29 నిమిషాలకు చేరనుంది. ఈ అదనపు సమయంలో థియేటర్లలో డిలీట్ చేసిన రష్మిక మందన్నాకు సంబంధించిన కొన్ని సీన్లను యాడ్ చేయనున్నారు.

నిజానికి యానిమల్ మూవీ ఓటీటీ రిలీజ్ కు చాలా రోజులుగా లీగల్ సమస్యలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని టీ సిరీస్ తో కలిసి నిర్మించిన సినీ 1 స్టూడియోస్ ఆ సంస్థతోపాటు నెట్‌ఫ్లిక్స్ పై కేసు వేసింది. తమకు రావాల్సిన బకాయిలను చెల్లించిన తర్వాతే మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాల్సిందిగా ఆదేశించాలని సినీ 1 స్టూడియోస్ కోర్టుకెక్కింది.

రూ.900 కోట్లకుపైగా వసూళ్లు చేసిన ఈ సినిమాలో మితిమీరిన హింస, ఆడవాళ్లను కించపరిచేలా డైలాగులు, సీన్లు ఉండటంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎంతో మంది ప్రముఖులు కూడా సినిమాపై విమర్శలు గుప్పించారు. అయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం మూవీ సక్సెసైంది.

ఎ సర్టిఫికెట్ మూవీ అయిన ఈ యానిమల్ ఇప్పుడు ఓటీటీలోకి అదనపు సమయంతో వస్తోంది. దీంతో ఈ సినిమాలో యాడ్‌ అయ్యే కంటెంట్‌ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. దర్శకుడే ఈ సినిమా చిన్నపిల్లలు చూడకూడదు.. మా ఇంట్లో పిల్లలకు కూడా చూపించను అన్నాడు.

మరీ ఓటీటీలో విడుదలైతే పిల్లలు కూడా చూస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. యానిమల్ మూవీ అటు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. ఈ మూవీ నుంచి ఏకంగా 19 నామినేషన్లు ఉండటం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu