Hanuman:టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన హనుమ్యాన్ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘హనుమాన్’. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కే నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం 300 గ్రాస్ కలెక్షన్లను అధిగమించింది. 92 యేళ్ల టాలీవుడ్ చరిత్రలో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది.
ఈ సినిమా సుమారుగా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకుపైగా షేర్ సాధించింది. దాంతో ఈ చిత్రం ఇప్పటికే 120 కోట్ల రూపాయలుకుపైగా లాభాలను పంచిపెట్టింది. ఇంకా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది.
ఇక సంక్రాంతి సీజన్‌లో ఇప్పటి వరకు అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల ‘అల వైకుంఠపురములో’ అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి చిత్రంగా నిలిచింది. తాజాగా హనుమాన్ మూవీ ‘అల వైకుంఠపురములో’ లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను క్రాస్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.
తాజాగా టాలీవుడ్‌లో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రాల విషయానికొస్తే.. గీతా గోవిందం, కార్తికేయ 2, బేబి, ఉప్పెన, ఫిదా, సీతారామం, విరూపాక్ష, జాతి రత్నాలు, ఇస్మార్ట్ శంకర్, బింబిసార, అర్జున్ రెడ్డి ఉన్నాయి. వీటి అన్నీంటిలో హనుమాన్ టాప్‌లో ఉంది.