HomeTelugu Big Storiesవిజువల్ ట్రీట్‌గా 'హనుమాన్‌' ట్రైలర్‌

విజువల్ ట్రీట్‌గా ‘హనుమాన్‌’ ట్రైలర్‌

HanuMan Telugu Trailer

టాలీవుడ్‌ యంగ్‌ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘హనుమాన్‌’. ప్రశాంత్‌వర్మ డైరెక్షన్‌లో తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు సినిమాపై ఓ రెంజ్‌లో హైప్‌ని క్రియేట్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.

ఈ ట్రైలర్‌లోని డైలాగ్స్‌, యాక్టింగ్‌ ఆకట్టుకుంటున్నాయి. అదిరిపోయే బీజీఎంతో సాగుతున్న విజువల్స్‌ సినిమాకి హైలైట్‌. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న హనుమాన్‌ హాలీవుడ్‌ స్థాయికి తగ్గకుండా ఉండబోతుందని ఇప్పటికే టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కే నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీలో కోలీవుడ్ భామ అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌరా హరి-అనుదీప్ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ స్తున్నారు.

శ్రీమతి చైతన్య సమర్పణలో తెరకెక్క్తున్న ఈ మూవీకి అస్రిన్‌ రెడ్డి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా, వెంకట్‌ కుమార్‌ జెట్టీ లైన్‌ ప్రొడ్యూసర్‌గా, కుశాల్‌ రెడ్డి అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. జాంబిరెడ్డి తర్వాత తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!