HomeTelugu Trending'అక్షయ్‌ని తీసుకుని ఇర్ఫాన్‌ ను పంపించు' అంటూ ట్వీట్‌.. డైరెక్టర్ కౌంటర్

‘అక్షయ్‌ని తీసుకుని ఇర్ఫాన్‌ ను పంపించు’ అంటూ ట్వీట్‌.. డైరెక్టర్ కౌంటర్

2
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణంతో సినీలోకం మొత్తం విషాదంలో ముగినిపోయింది. ఇర్ఫాన్ లాంటి నటుడిని కోల్పోవడం దురదృష్టం అంటూ సినీతారలు సంతాపాన్ని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు ఇర్ఫాన్ కు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ట్వీట్ ఇప్పడు కలకలం సృష్టిస్తుంది. ఓ మహిళా ‘అక్షయ్ కుమార్ను తీసుకునిపోయి చనిపోయిన ఇర్ఫాన్ ఖాన్ ని తిరిగి పంపించండని’ అని ట్వీట్ చేసింది. దీనిపై అక్షయ్ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ఓ అభిమాని స్పందిస్తూ.. అంతలా అక్షయ్ మీకు ఏంచేశాడు.. మోడీకి మద్దతు తెలపడం నేరమా ..? తన సినిమాలు తాను చేసుకుంటూ.. ప్రజలకు సాయం చేస్తున్నాడు. అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ చక్కర్లు కొడుతూ.. టాలీవుడ్ డైరెక్టర్‌ హరీష్ శంకర్ కు చేరింది. హరీష్ ఆ ట్వీట్ పై రియాక్ట్‌ అయ్యారు.. ‘అక్షయ్ కుమార్ ను తీసుకుని ఇర్ఫాన్ ఖాన్ తిరిగి పంపించండని అంటున్నారు.. అది అంత సులభమా.. ఒకవేళ అదే జరిగితే అలాంటి మైండ్ సెట్ ఉన్నందుకు ఎంతో మంది ఆమెను తీసుకెళ్లమని అనేవారు.. మొదటగా ఆమె ఇక్కడ ఉండేది కాదు’ అని కౌంటర్ ట్వీట్ వేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!