హీరో గోపీచంద్‌కు గాయాలు!

హీరో గోపీచంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన హీరోగా తిరు దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతోంది. ప్రస్తుతం జైపూర్‌ సమీపంలోని మాండవలో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. సోమవారంతో అక్కడ షూటింగ్‌ పూర్తి కాబోతోందట. ఈ క్రమంలో గోపీచంద్‌పై బైక్‌ ఛేజింగ్‌ పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో బైక్‌ పై నుంచి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. చిత్ర బృందం ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని, చికిత్స తర్వాత మిగిలిన షూటింగ్‌ చేసుకోవచ్చని వైద్యులు తెలిపారు.