హీరో రామ్‌కు జరిమానా విధించిన పోలీసులు

యంగ్‌ హీరో రామ్‌కు చార్మినార్‌ పోలీసులు జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసినందుకు రామ్‌ నుంచి రూ.200 జరిమానా కింద వసూలు చేశారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లో రామ్‌ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌ చార్మినార్‌ ప్రాంతంలో జరుగుతోంది. షూటింగ్‌ విరామ సమయంలో రామ్‌ సిగరెట్‌ తాగుతూ కనిపించడంతో స్థానిక చార్మినార్‌ ఎస్సై పండరీ రూ.200 జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశాలు, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ధూమపానం చేయడాన్ని నేరంగా పరిగణించి జరిమానా విధిస్తామని హైదరాబాద్‌ పోలీసులు ఇది వరకే హెచ్చరించిన సంగతి తెలిసిందే.