HomeTelugu Trendingసుమంత్‌ అశ్విన్‌ హల్దీ ఫంక్షన్‌ ఫొటోలు వైరల్‌

సుమంత్‌ అశ్విన్‌ హల్దీ ఫంక్షన్‌ ఫొటోలు వైరల్‌

Hero sumanth ashwin haldi f
ప్రముఖ నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు ఏకైక కుమారుడు, యువ హీరో సుమంత్‌ అశ్విన్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన దీపిక అనే అమ్మాయి మెడలో శనివారం(ఫిబ్రవరి 13)సుమంత్‌ మూడుముళ్లు వేయనున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఈ కొత్త జంట హల్దీ వేడుకను జరుపుకుంది. ఈ ఫంక్షన్‌లో సుమంత్ ‘కేరింత’‌ మూవీ సహ నటుడు విశ్వంత్‌, మరికొందరు నటీనటులు సందడి చేశారు

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌ పట్టణ శివారులోని ఫాంహౌస్‌లో సుమంత్‌-దీపికల వివాహ మహోత్సవం జరగనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!