HomeTelugu Trendingఆది సాయికుమార్‌ సినిమాలో సునీల్‌!

ఆది సాయికుమార్‌ సినిమాలో సునీల్‌!

Hero Aadi sai kumar new mov

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది సాయికుమార్- దర్శకుడు క‌ళ్యాణ్ జీ గోగ‌ణ కాంబినేషన్‌లో ఓ సినిమా చిత్రం ప్రారంభం అవుతుంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ‘విజన్ సినిమాస్ పతాకంపై ఆది సాయికుమార్ హీరోగా సినిమా చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ న‌చ్చింది. ఆది సాయికుమార్‌ను మ‌రో కొత్త డైమ‌న్ష‌న్‌లో ప్రెజంట్ చేసే చిత్ర‌మిది. అలాగే హీరో సునీల్‌గారు మా చిత్రంలో ఓ కీలక పాత్రలో క‌నిపించ‌బోతున్నారు. పాత్ర‌కున్న ప్రాధాన్య‌త‌ను బ‌ట్టి.. సునీల్‌గారైతే బావుంటుంద‌ని ఆయ‌న్ని కలిసి అడ‌గ్గానే ఆయ‌న న‌టించ‌డానికి ఒప్పుకున్నందుకు ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌ అని అన్నారు. ఈ చిత్రాన్ని మా బ్యాన‌ర్‌పై ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తున్నాం. ఎన్నో చిత్రాల‌కు స‌క్సెస్‌ఫుల్ మ్యూజిక్‌ను అందించిన సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించ‌బోయే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!