షార్ట్‌ ఫిలింలో రష్మిక మేడమ్‌ సందడి

టాలీవుడ్ లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. గీత గోవిందం సినిమాలతో వరుస విజయాలతో ఆకట్టుకుంటుంది. ఈ భామ ఇటీవల దేవదాస్‌తో మరో సక్సెస్‌ను అందుకుంది. దీంతో రష్మికను లక్కీ హీరోయిన్‌గా భావిస్తున్నారు తెలుగు హీరోలు‌. ప్రస్తుతం టాలీవుడ్‌ లో బిజీగా ఉన్న రష్మిక ఓ షార్ట్‌ ఫిలింలో సందడి చేసింది. ‘ఎవ్రీ నాన్‌ తెలుగు ఫ్రెండ్ ఎవర్‌’ పేరుతో తెరకెక్కిన ఈ షార్ట్‌ ఫిలిం రష్మిక తెలుగు రాని కన్నడ అమ్మాయిగా కనిపించింది.

రష్మికకి తెలుగు రాకపోవటంతో ఎవరైన తెలుగులో మాట్లాడిన విషయాలను తెలుసుకునేందుకు తన ఫ్రెండ్‌ సాయం తీసుకోవటం, సినిమాలకు తన ద్వారా డబ్బింగ్ చెప్పించుకోవటం లాంటి సీన్స్‌ను ఫన్సీగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ దమ్ము సినిమా చూసి రష్మిక ఇచ్చిన రియాక్షన్స్‌ సూపర్బ్‌. ప్రస్తుతం ఈ షార్ట్‌ ఫిలిం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది.