సరిలేరు నీకెవ్వరులో రష్మికకు అవకాశం ఎలా వచ్చిందంటే..

నటి రష్మిక మందన్న టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు రెండో సినిమాతో గీత గోవిందంతో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా వందకోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోవడంతో రష్మికకు అవకాశం దక్కింది.

దీంతో పాటు చేసిన దేవదాస్ బాగుంది అనిపించింది. ఇప్పుడు డియర్ కామ్రేడ్ చేస్తోంది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతున్నది. అయితే, మహేష్ సినిమా సరిలేరు నీకెవ్వరూ లో మొదట రష్మికను తీసుకోవాలని అనుకున్నారు. రష్మికను అడిగితె.. నితిన్ తో భీష్మ, తమిళంలో కార్తికేయన్ తో సినిమా చేస్తుండటంతో..ఏం చేయలేక నో చెప్పింది.

అయితే, తమిళంలో శివ కార్తికేయన్ సినిమాలో రష్మిక రోల్ ను బాగా తగ్గించి, కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితం చేశారట. ఇది తెలుసుకున్న రష్మిక సినిమానుంచి తప్పుకుంది. అప్పటికి సరిలేరు నీకెవ్వరు హీరోయిన్ బెర్త్ ఖాళీగా ఉండటంతో వెంటనే బుక్ చేసుకుంది. అలా ప్రిన్స్ సూపర్ స్టార్ సినిమాలో అవకాశం దక్కించుకుంది రష్మిక.