బాహుబలిని ఆ సినిమా మించుతుందా..?

బాహుబలి2 సినిమా ప్రభావం చాలా మంది మేకర్స్ మీద పడింది. ఆ రేంజ్ లో సినిమాలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. సుందర్.సి దర్శకత్వం వహించనున్న ‘సంఘమిత్ర’తో బాహుబలి2 ని బీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. అయితే ప్రారంభం నుండే సినిమా నేషనల్ వైడ్ గా చర్చనీయాంశం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
ఈ సినిమాను కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఓ లాంచ్ చేస్తుండడం విశేషం. దీనికోసం దర్శకనిర్మాతలతో పాటు హీరో జయం రవి, ఆర్య, శృతిహాసన్ వంటి వారు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరు కానున్నారు. ఇంతవరకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నడూ లేనంత విధంగా భారీ బడ్జెట్ ను ఈ సినిమా కోసం కేటాయించమని దర్శకుడు చెబుతున్నారు. అయితే ఆ మొత్తం ఎంతనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరి విజువల్ గా టెక్నికల్ గా ఈ సినిమా బాహుబలిని బీట్ చేస్తుందేమో చూడాలి!