నేను చూడటానికి రోడ్‌ సైడ్‌ రోమియోలా ఉన్నానేంటి..వర్మ

వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆదివారం తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితం ఇదే రోజున ‘శివ’ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైందని అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా షూటింగ్‌ను ప్రారంభించారంటూ.. ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అదేవిధంగా యువకుడిగా ఉన్నప్పుడు ఇలా ఉన్నానేంటి అని వర్మ తనను తానే ప్రశ్నించుకున్నారు. ఫొటో పోస్ట్ చేస్తూ.. ‘నేను చూడటానికి రోడ్‌ సైడ్‌ రోమియోలా ఉన్నానేంటి.. నమ్మలేకపోతున్నా. ఇది ‘శివ’ సినిమా రోజుల్లో తీసిన ఫొటో’ అని ట్వీట్‌ చేశారు.

వర్మ ప్రస్తుతం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రేమికుల రోజున విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఫిబ్రవరి 22న ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కాబోతోంది. ఇందులో లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞశెట్టి నటిస్తున్నారు.