‘ఓ బేబీ’.. సమంత లుక్‌

స్టార్‌ హీరోయిన్‌ సమంత దర్శకురాలు నందినిరెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై సామ్‌ ఎప్పుడూ స్పందించలేదు. చివరికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ‘ఓ బేబీ’ టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు సమంత వెల్లడించారు. సినిమాలో తన లుక్‌కు సంబంధించిన ఫొటోను కూడా సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఆమె లుక్‌ అద్భుతంగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఫొటోలో సామ్‌ గాయనిగా కనిపించారు.

‘నా మార్గాన్ని ఎంచుకోవడానికి ఆ దేవుడు, నా చుట్టూ ఉన్న ప్రజలు ఎంతో సహకరించారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాల్ని. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వృద్ధి చెందడానికి కొంచెం సమయం తీసుకున్నా. ఈ క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నా. ఇవాళ నా వృద్ధిలోని సంతృప్తిని ఆస్వాదిస్తున్నా. ‘ఓ బేబీ’ అనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నా. ఈ ప్రాజెక్టు చాలా ప్రత్యేకం కాబోతోంది. నా ప్రియమైన దర్శకురాలు నందిని రెడ్డి నాకు ఎంతో ఇష్టమైన పాత్రను ఇచ్చారు’ అని సామ్‌ పోస్ట్‌ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates