జర్నలిస్ట్ గా మారుతోన్న సమంతా!

జనతా గ్యారేజ్ సినిమా తరువాత సమంతా మరే ప్రాజెక్ట్ అంగీకరించలేదు. కొత్త కథల కోసం ఎదురుచూస్తూ.. వ్యక్తిగత జీవితం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పుడిప్పుడే కొత్త సినిమాల కబుర్లు చెబుతోంది. ఈ ఏడాదిలో అమ్మడు తెలుగు కంటే తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించనుంది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలో సమంతా కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు చిత్రనిర్మాత అశ్వనీదత్ తెలిపారు. నిజానికి టైటిల్ రోల్ కోసం సమంతను అడిగారు కానీ రోల్ కోసం అమ్మడు బరువు పెరగడం, తగ్గడం లాంటివి చేయడం కష్టమని డ్రాప్ అయింది.

అయితే స్క్రిప్ట్ బాగా నచ్చడంతో సినిమాలో మరో రోల్ లో కనిపించడానికి ఆసక్తి చూపించింది. ఓ జర్నలిస్ట్ గా కనిపించబోతోంది. సావిత్రి ఆత్మ కథను రాసే జర్నలిస్ట్ పాత్రలో సమంతా కనిపించనుంది. ఆ పాత్ర దృష్టి కోణం నుండే సావిత్రి కథ మొదలవుతుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి నెల నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. నాగాశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ బాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.