రావణుడ్ని సంపే ధైర్యం ఉందా..?

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న సినిమా ‘జై లవకుశ’. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అందరినీ ఆకర్షించింది. ఎన్టీఆర్ మాస్ లుక్ తో అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్ లో ఎన్టీఆర్ తన లుక్స్ తో, మాటలతో అదరగొట్టేశాడు. ”సుర సుర సుర అంటూ బ్యాక్ గ్రౌండ్ తో సాగిన టీజర్ లో ఎన్టీఆర్.. ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణుడ్ని సంపాలంటే సముద్రమంత ద.. ద.. ధైర్యం ఉండాలా..? ఉందా అంటూ యాసలో చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. దేవిశ్రీప్రసాద్ టీజర్ తోనే సినిమాలో తన నేపధ్య సంగీతం ఏ రేంజ్ లో ఉండబోతుందో.. చెప్పేశాడు. టీజర్ ఖచ్చితంగా సినిమాపై అంచనాలను మరింత పెంచడం ఖాయం. రాశిఖన్నా, నివేదా థామస్, నందితలు హీరోయిన్లు గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు.