పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తా: కత్తి మహేష్‌

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. ఈ రోజు ప్రకాశం జిల్లాలో మహేష్‌ మాట్లాడుతూ దళిత జాతికి రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయన్నారు. దళితులకు రాజ్యాధికారం దక్కాలన్న ఆయన.. కొత్త దళిత నాయకత్వం కోసం జిల్లాల పర్యటన చేస్తున్నానని తెలిపారు. ఇటీవల జరిగినవి పరువు హత్యలు కాదని.. కుల ఉన్మాద హత్యలను మహేష్‌ అన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ప్రతి విషయంలోనూ వెనకడుగు వేయడం అలవాటేనని అన్నారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.