
Sree Vishnu Upcoming Movies:
టాలీవుడ్లో యూత్‌ఫుల్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న శ్రీ విష్ణు, తన కొత్త సినిమా **’సింగిల్’**తో మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కామెడీ, వినోదం, యూత్ ఎలిమెంట్స్‌తో నిండిన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీ విష్ణు తన ఫ్యాన్స్‌ను అలరించేందుకు రెడీగా ఉన్నాడు.
‘సింగిల్’ తర్వాత శ్రీ విష్ణుకు మూడు సినిమాల లైన్ అప్ రెడీగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ట్రై చేయడంలో శ్రీ విష్ణు ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు కూడా ఆయన చేతిలో ఉన్న సినిమాలు అన్నీ వేరే వేరే జానర్లలో ఉంటాయని సమాచారం.
మొదటి ప్రాజెక్ట్ ‘మృత్యుంజయ’, ఇది గుణం గంగరాజు సృష్టించిన ‘అమృతం’ ఫేమ్ Just Yellow బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఒక థ్రిల్లర్ కాన్సెప్టుతో ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం శ్రీ విష్ణు దాదాపు 30 రోజులు షూటింగ్ పూర్తి చేశాడు.
ఇంకో సినిమా మాత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇది సంపూర్ణ కుటుంబ కథా చిత్రం అవుతుందని సమాచారం. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
మూడవ సినిమా మాత్రం ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో నడవబోతుంది. మన్సూన్ టైమ్‌లో ఈ సినిమా ప్రధానంగా షూట్ చేయనున్నట్లు బజ్. ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాది వేసవికాలం నుంచి వరుసగా థియేటర్లలోకి రానున్నాయి.
ఇవన్నీ చూస్తే శ్రీ విష్ణు ఫ్యాన్స్‌కు ఇది ఫుల్ ఫన్‌తో కూడిన టైమ్ కానుంది. సినిమాల వేరియేషన్, కథల కొత్తదనం చూస్తే శ్రీ విష్ణు మరోసారి తన గుర్తింపును ముద్రించబోతున్నాడనే చెప్పాలి. మరి ఈ సినిమాలపై త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ వస్తాయి.
ALSO READ: ఆపరేషన్ సింధూర్ కారణంగా IPL 2025 క్యాన్సిల్ అయ్యిందా?