కాజల్ కు మరో బాలీవుడ్ ఛాన్స్..?

పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘టెంపర్’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను అభిషేక్ బచ్చన్ చేస్తాడని అప్పట్లో ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమా రన్ వీర్ సింగ్ చేతుల్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

తెలుగులో సినిమా చూసిన రోహిత్ కు కాజల్ నటన నచ్చడంతో హిందీలో కూడా ఆమెనే తీసుకుంటే బావుంటుందనే నిర్ణయానికి వచ్చేశారు. టెంపర్ తమిళ్ రీమేక్ లో కూడా హీరోయిన్ గా కాజల్ నే ఎన్నుకున్నారు. ఇప్పుడు హిందీ అవకాశం కూడా ఆమెకే రావడం విశేషమనే చెప్పాలి. గతంలో కాజల్ పలు హిందీ సినిమాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. మరి ఈ సినిమాతో తన సత్తా చాటుతుందేమో చూడాలి!