శర్వా సరసన సీనియర్ హీరోయిన్!

‘మహానుభావుడు’ చిత్రంతో సక్సెస్ అందుకున్న శర్వానంద్ తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. ఒక పాత్ర కోసం షాలిని పాండేను ఫైనల్ చేసుకున్నారని తెలుస్తోంది. అలానే మిడిలేజ్ క్యారెక్టర్ కోసం సీనియర్ హీరోయిన్ కాజల్ ను తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే
కాజల్ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఆమె నటించిన ‘అదిరింది’ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో శర్వా సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని సంప్రదించారు. అయితే ఆమె ఒప్పుకుందో.. లేదో.. అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు!