HomeTelugu Trendingఓటీటీలో 'సూపర్‌ మచ్చి'!

ఓటీటీలో ‘సూపర్‌ మచ్చి’!

Kalyan Dev Super Machi in

క‌రోనా సెకండ్‌వేవ్‌ నేపధ్యంలో మరోసారి థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. థియేట‌ర్స్ మూత‌ప‌డ‌డం, రానున్న రోజుల‌లో పెద్ద సినిమాలు విడుద‌ల కానుండ‌డంతో చిన్న సినిమాలు ఓటీటీల‌ని ఆశ్ర‌యిస్తున్నాయి. ఇప్ప‌టికే జబర్దస్త్‌ బ్యూటీ అన‌సూయ న‌టించిన ‘థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్’ చిత్రం ఆహాలో విడుద‌లకి రెడీ అయింది. కాగా, ఇప్పుడు మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ న‌టించిన ‘సూప‌ర్ మ‌చ్చి’ కూడా ఆహాలో రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తుంది. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.వ‌చ్చే నెల‌లో ఈ చిత్రాన్ని ఆహాలో స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. చిత్రంలో ర‌చితా రామ్‌తో పాటు ఒక కీల‌క పాత్రలో అజ‌య్‌ ఈ సినిమాలో నటిస్తోన్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu