సునీల్ కథతో నందమూరి హీరో!

ఇండస్ట్రీలో ఒకరి కోసం అనుకున్న కథలు మరో హీరోకి చెప్పి ఓకే చేయించుకోవడం సాధారణమైన విషయమే. అయితే తనకు ఈ సినిమా మంచి హిట్ ఇస్తుందని హీరో నమ్మి ఎదురుచూస్తుంటే ఆ కథ మరో హీరోకి వెళ్లిపోతే ఖచ్చితంగా బాధ పడతారు. సరిగ్గా ఇదే పరిస్థితి సునీల్ కు ఎదురైంది. ఈ మధ్యన సునీల్ ఏ సినిమా చేసినా.. కలిసి రావడం లేదు. ఫ్లాప్ లు సునీల్ ను పలకరిస్తూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో సునీల్ కు, ఉపేంద్ర అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఓ కథ వినిపించాడట. కథ నచ్చడంతో సునీల్ ప్రొసీడ్ అవ్వాలనుకున్నాడు.
కానీ సునీల్ హీరోగా, కొత్త డైరెక్టర్ అనగానే ఏ నిర్మాత ముందుకు రాలేదు. దీంతో ఉపేంద్ర ఆ కథను కల్యాణ్ రామ్ కు చెప్పి ఓకే చేయించుకున్నాడట. కల్యాణ్ రామ్ హీరోగా వేరే బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. అయితే దీనికంటే ముందుగా కల్యాణ్ రామ్, పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. తనునమ్మిన కథ వేరే హీరోకు వెళ్లిపోవడంతో సునీల్ కు నిరాశ తప్పలేదు. ప్రస్తుతం తను నటిస్తోన్న ‘ఉంగరాల రాంబాబు’ సినిమా అయినా.. హీరోగా తనకు మంచి హిట్ ఇస్తుందేమో.. చూడాలి!