రజనీ నిర్మాతగా కమల్!


సూపర్‌ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా రజనీకాంత్ కి ఇది 168వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఆ తరువాత సినిమాలో రజనీ .. కమల్ తో కలిసి నటించనున్నట్టుగా కోలీవుడ్‌ వర్గల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇద్దరం మాట్లాడుకునే కలిసి నటించడం మానేశామని గతంలోనే కమలహాసన్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. అలాంటిది ఇప్పుడు ఈ వార్తలు షికారు చేస్తుండటంతో అభిమానులు షాక్‌ అయ్యారు. అయితే రజనీ .. కమల్ కలిసి నటించడం లేదు. రజనీ సినిమాకి కమల్ నిర్మాతగా వ్యవహరించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. ఆగస్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు సమాచారం.