HomeTelugu Trending'తేజస్‌' పైలట్‌గా కంగన ఫస్ట్‌లుక్‌

‘తేజస్‌’ పైలట్‌గా కంగన ఫస్ట్‌లుక్‌

5 16
బాలీవుడ్‌ ప్రముఖ నటి కంగనా రనౌత్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘తేజస్‌’. ఈ సినిమాలో ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌గా కంగనా కనిపించనున్నారు. ఆర్‌ఎస్‌వీపీ ప్రొడెక్షన్‌ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి రోనీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ‘తేజస్‌’ సినిమాను ప్రకటిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కంగనకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సోమవారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో కంగన ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌గా కనిపించారు. ‘తేజస్‌’ సినిమాకు సర్వేశ్‌ మేవర దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే సదరు నిర్మాణ సంస్థలో మన దేశ సైనికుల గురించి తెరకెక్కిన ‘యూరి’ చిత్రం సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!