HomeTelugu Trendingటికెట్స్‌ అమ్ముతున్న కంగనా రనౌత్‌

టికెట్స్‌ అమ్ముతున్న కంగనా రనౌత్‌

10 16
బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్.. తెలుగులో యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన ‘ఏక్ నిరంజన్‌’ సినిమాలో ‘సమీర’గా ఇరగదీసిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా యావరేజ్ టాక్‌ రావడంతో కంగనాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే హిందీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్.. అంతేకాదు మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది. ఆ మధ్య కంగనా ప్రధాన పాత్రలో వచ్చిన ‘మణికర్ఱిక’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఆమె వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. అందులో భాగంగా తమిళ నటి, రాజకీయవేత్త జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్ర చేస్తోంది. కంగనా మరో లేడీ ఓరియెంటెడ్ మూవీలో కూడా నటిస్తోంది. అదే ‘పంగా’ ఈ చిత్రానికి సంబందించి తాజాగా ట్రైలర్ కూడ విడుదలైంది. ఈ చిత్రంలో కంగనా రైల్వే ఉద్యోగి మధ్యతరగతి యువతి పాత్ర చేస్తుంది. వచ్చే ఏడాది జనవరి 24న పంగా విడుదల కానుంది. దీంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. అందులో భాగంగా ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్‌లో కంగనా సాధారణ ఉద్యోగిలా టికెట్స్ అమ్మింది. దీంతో ప్రయాణికులు ఆమెను చూసి షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!