HomeTelugu Newsనటుడికి దేహశుద్ది చేసిన స్థానికులు

నటుడికి దేహశుద్ది చేసిన స్థానికులు

3 28కన్నడ నటుడు హుచ్చా వెంకట్‌ కొడగు జిల్లాలోని ఓ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న స్థానికులు నటుడు వచ్చాడంటూ ఎగబడి చూశారు. ఇది నచ్చని వెంకట్‌ హోటల్‌ నుంచి రోడ్డుపైకి వచ్చి అక్కడున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం అక్కడే ఉన్న ఓ కారుపై రాళ్లు విసిరి అద్దాలు పగలకొట్టాడు. కారు డోర్‌నూ ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. వెంకట్‌ వింత ప్రవర్తనను చూసి స్థానికులు అతడిని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నటుడిని అదుపులోకి తీసుకున్నారు.

హుచ్చా వెంకట్‌ కన్నడలో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. కన్నడలో ప్రసారమయ్యే బిగ్‌బాస్‌-3లో పాల్గొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!