చైతు వద్దన్నాడని సామ్ తప్పుకుంది!

రా రండోయ్ వేడుక చూద్దాం సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరినీ ఆకర్షించే పాయింట్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటివరకు టిపికల్ హీరోయిన్ గ్లామర్ రోల్స్ చేసిన రకుల్ మొదటిసారి పల్లెటూరి యుయతి పాత్రలో కనిపించనుంది. భ్రమరాంబ పాత్ర తన కెరీర్ లో గుర్తుండిపోతుందని తెగ సంబరపడి పోతూ చెబుతోంది. నిజానికి ఈ రోల్ సమంత చేయాల్సింది. దర్శకుడు కల్యాణ్ కృష్ణ సమంత, చైతులను దృష్టిలో పెట్టుకొని రాసిన కథ ఇది.

కానీ త్వరలోనే పెళ్లి కాబోతున్న తమ ఇద్దరి బంధాన్ని క్యాష్ చేసుకున్నట్లు అవుతుందని మంచి కథ కాంబినేషన్ వల్ల వచ్చే అటెన్షన్ కారణంగా పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయని చైతు, సమంత వద్దని చెప్పాడట. ఆమె స్థానాన్ని భర్తీ చేయడానికి రంగంలోకి రకుల్ ప్రీత్ ను దించారు. ఇప్పుడు రకుల్ తన పాత్రతో అందరినీ డామినేట్ చేసి నెక్స్ట్ లెవెల్ కు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఇంత మంచి ఛాన్స్ మిస్ చేసిన చైతుపై సామ్ గుర్రుగా ఉంటుందో.. లేక తన ప్రియుడి కొత్త అవతారాన్ని చూసి మురిసిపోతుందో.. చూడాలి!