‘కాటమరాయుడు’ అసలు లెక్కలివి!

బాహుబలి సినిమా తరువాత తెలుగులో ఆ రేంజ్ ప్రీరిలీజ్ బిజినెస్ అదరగొట్టిన సినిమా ఏంటంటే వెంటనే పవన్ కల్యాణ్ అభిమానులు ‘కాటమరాయుడు’ అని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా లెక్కలు కూడా చెబుతున్నారు. ప్రీరిలీజ్ బిజినెస్ మొత్తం కలుపుకుంటే కాటమరాయుడు వచ్చిన విలువ 115 కోట్లు.. థియేట్రిక‌ల్ రిలీజ్ హ‌క్కులు, శాటిలైట్‌, డ‌బ్బింగ్, ఆడియో, వీడియో రూపంలో ఓవ‌రాల్ బిజినెస్ ఇంత చేసింది.

అసలు సినిమా ఖర్చు 30 కోట్లు.. అంటే 115 కోట్ల నుండి 30 కోట్లు తీసేస్తే 85 కోట్లు అన్నమాట. తమిళ వీరమ్ సినిమాకు రీమేక్ ఇది. ఇప్పటికే వీరమ్ సినిమా వీరుడొక్కడే పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. ఆ సినిమాను రీమేక్ చేసి పవన్ 85కోట్లు టేబుల్ ప్రాఫిట్ ను సాధించాడు. ఇదీ పవన్ కు ఉన్న క్రేజ్ అంటే.. ఈ శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళం, కన్నడలలో కూడా ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.