కాటమరాయుడు డబ్బింగ్ మొదలెట్టేశాడు!

పవన్ కల్యాణ్, బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘కాటమరాయుడు’ కోసం పవన్ ఎంతగానో కష్టపడుతున్నాడు. అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలన్స్ చేసుకుంటూ నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో మూడు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టేశాడు. అదే సమయంలో 2019 ఎన్నికలకు కూడా రెడీ అయిపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమా డెడ్ లైన్ దగ్గర పడుతుండంతో పవన్ తన పాత్ర టాకీ పార్ట్ పూర్తి చేసి నిన్న రాత్రి నుండి డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టేశాడు.

ఇది పూర్తవ్వగానే పవన్ తన చిత్రబృందంతో కలిసి పాటల షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లనున్నాడు. మార్చి నెలలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించి మార్చి 24, 28 తేదీల్లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.