ఎన్టీఆర్ తో కూడా సై!

ప్రస్తుతం టాలీవుడ్ లో తన ఐటెమ్ సాంగ్స్ తో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసేస్తోంది రాయ్ లక్ష్మీ. తోబా.. తోబా.. అంటూ పవన్ కల్యాణ్ తో చిందేసిన ఈ భామ రీసెంట్ గా రత్తాలు అంటూ చిరంజీవితో ఆడిపాడింది. ఇప్పుడు మరో ఐటెమ్ సాంగ్ ఆఫర్ అమ్మడు చెంతకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాతాభినయం చేయనున్నారు. ముగ్గురు హీరోయిన్లు కూడా మెరవనున్నారు. వాటితో పాటు మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ను డిజైన్ చేశాడట దర్శకుడు బాబీ. దానికోసం రాయ్ లక్ష్మీ అయితే సెట్ అవుతుందని ఆమెను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అగ్ర హీరోల సరసన నర్తించిన ఈ భామ ఇప్పుడు యంగ్ టైగర్ పక్కన డాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసిందని ఫిల్మ్ నగర్ లో టాక్. ఈ సినిమాను ఫిబ్రవరి రెండో వారంలో మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ లో సినిమాను విడుదల చేయాలని ఇప్పటినుండే ప్లాన్ చేసుకుంటున్నారు.